అవును, కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రాత్రంతా కష్టపడ్డాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా అంటారా? షూటింగ్ మొత్తం పూశ్ర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్న ఈ సినిమా డబ్బింగ్ ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోలో జరుగుతుంది. దాదాపు సినిమాకి సంబందించిన వర్క్ అంత పూర్తవుతుండటం పవన్ డబ్బింగ్ బాలన్స్ ఉండటంతో పవన్ నిన్నటి నుండి డబ్బింగ్ చెప్పడం ప్రారంబించాడు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ రాత్రంతా కష్టపడి డబ్బింగ్ చెప్పాడు. రాంబాబు సినిమా కోసం పవన్ ఇంత ఇంట్రస్ట్ చూపిస్తుండటం చూస్తే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మీద పవన్ చాలా నమ్మకం పెట్టుకున్నట్లు అనిపిస్తుంది.