శరవేగంగా సాగుతున్న ‘అత్తారింటికి దారేది’ షూటింగ్

శరవేగంగా సాగుతున్న ‘అత్తారింటికి దారేది’ షూటింగ్

Published on Jun 12, 2013 9:10 AM IST

Pawan-Kalyan-and-Trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమాని ఆగష్టు మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేయడానికి అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని ఈ సినిమా ప్రొడక్షన్ టీం చెప్పడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని షెడ్యూల్ లో అనుకున్న విదంగా ఆగష్టు 7లోగా పూర్తీ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ మద్య జరిగిన హైదరాబాద్ షెడ్యూల్ లో ఈ సినిమా టీం షూటింగ్ లో అనుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ ని త్వరలో స్పెయిన్ లో నిర్వహించనున్నారు. తరువాత యూరోప్ లో కూడా కొన్నివారాలు షూటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సమంత, ప్రణిత హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు