ఈ నెలాఖరు నుండి పవన్ కళ్యాణ్ డబ్బింగ్

Pawan-Kalyan

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాకి త్వరలోనే డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టనున్నాడు. ఈ నెలాఖరు నుండి షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా మొదలు కానుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉండనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సారిగా పవన్ కళ్యాణ్, సమంత కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Exit mobile version