పవన్ కళ్యాణ్‌లో మునుపెన్నడూ లేని మార్పు

PawanKalyan

గతంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏడాదికి ఒకటి మాత్రమే విడుదలయ్యేది. సినిమా చిత్రీకరణ మొదలైతే కనీసం ఐదారు నెలలు జరిగేది. అందుకే ఒకటిన్నర దశాబ్దానికి పైగా కెరీర్ ఉన్నప్పటికీ ఆయన్నుండి వచ్చిన సినిమాలు పాతిక కూడ ఉండవు. అంత నెమ్మదిగా ఉండేది పవన్ పనితనం. కానీ ఇప్పుడు అలా కాదు. వేగం పుంజుకుంది. మునుపటిలా ఏడాదికి ఒక సినిమా చేస్తే కుదరదని ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకున్నారు ఆయన. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ ముగించి రానా కాంబినేషన్లో రీమేక్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ ముగియగా మిగతా షూటింగ్ మే చివరికి ముగుస్తుందట. ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని చేస్తున్నారు. ఇది కూడ కొంత భాగం షూటింగ్ పూర్తైంది. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేస్తున్నారు ఆయన. ఈ ఏడాదిలో రెండు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి ఒక సినిమాను విడుదలచేసే యోచనలో ఉన్నారు పవన్.

Exit mobile version