పవన్ కొత్త సినిమా కోసం ఓవర్సీస్ లో భారీ పోటీ

పవన్ కొత్త సినిమా కోసం ఓవర్సీస్ లో భారీ పోటీ

Published on Aug 27, 2012 12:45 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్నచిత్రం ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్ర రైట్స్ కోసం ఓవర్సీస్ బయ్యర్స్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య స్వయంగా తానే యు.ఎస్.ఎ లో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్ర ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ రైట్స్ ఎలిగ్సిర్ ఇండియా ఎంటర్టైన్మెంట్ వారు 30 లక్షలకు సొంతం చేసుకొని ‘గబ్బర్ సింగ్’ రికార్డు ని బద్దలు కొట్టారు. ఈ చిత్ర యు.కె రైట్స్ ని కలర్స్ మీడియా వారు 30 లక్షలకు సొంతం చేసుకున్నారు. మిగిలిన ఏరియాల్లో కూడా రికార్డు మొత్తానికి రైట్స్ అమ్ముడుపోతున్నాయి.

ఇదంతా చూస్తుంటే పవన్ – పూరి సినిమా విడుదలకి ముందే రికార్డులు సాదించేలా ఉంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు