పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రమే “ఓజి”. తన ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ లో వచ్చి రికార్డు ఓపెనింగ్స్ అందుకుంది. అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఇదే స్పీడ్ ని కొనసాగుతుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ 4 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసి సెన్సేషన్ సెట్ చేసింది.
దీనితో ఈ రెండు రోజుల్లో ఓజి చిత్రం 4.2 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకొని నెక్స్ట్ 4.5 ఆ తర్వాత 5 మిలియన్ క్లబ్ లో చేరిపోయేందుకు సిద్ధం అయ్యింది. మరి వీకెండ్ లోనే ఈ మార్క్ ని ఓజి కొట్టేస్తుందో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు.
The OG storm shows no mercy ❤️????#TheyCallHimOG North America gross storms past $4.2M+ and racing higher!????https://t.co/MSpn6ryrw8 North America by @PrathyangiraUS #BlockbusterOG #BoxOfficeDestructorOG pic.twitter.com/EiYydswUyM
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 27, 2025