పవన్ కళ్యాణ్ జల్సా 2 చేయబోతున్నాడా?

పవన్ కళ్యాణ్ జల్సా 2 చేయబోతున్నాడా?

Published on Mar 21, 2012 8:31 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికి కూడా ఆ సినిమాలో పాట వస్తే ఆనందంతో చిందులేస్తారు. ఇదే కాంబినేషన్ మరోసారి కార్యరూపం దాల్చనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడనే వార్త చాలా రోజులుగా వినిపిస్తుంది. ఇలియానా హీరొయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకి జల్సా 2 అనే అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ వార్త గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాము.

తాజా వార్తలు