పవన్ కళ్యాణ్ పార్టీ చిహ్నం మరియు జెండా
పార్టీ చిహ్నం మన దేశంలో ప్రజలు జీవిత విధానాన్ని వారు పడుతున్న ఇబ్బందులను తెలిపేవిధంగా ఉంటుంది.
బ్యాక్ గ్రౌండ్ కలర్ వైట్ (తెలుపు రంగు) :
బ్యాక్ గ్రౌండ్ లో తెలుపురంగు శాంతికి చిహ్నంగా అలాగే వేల సంవత్సరాలుగా ప్రజల స్థిరత్వాన్ని మన సంస్కృతిని తెలియజేస్తుంది.
రెడ్ కలర్ (ఎరుపు రంగు) :
ఈ చిహ్నంలోని ఎరుపు రంగు విప్లవానికి గుర్తు. అలాగే నిజమైన మార్పు , ఆ మార్పు ఎలా వుండాలంటే పురాతన దేశంలో జరిగిన వాటికి ఇప్పుడు జరుగుతున్నా వాటికి వ్యత్యాసన్ని తెలిపే విదంగా ఉండనుంది.
ఆరు స్టార్స్ :
చిహ్నంలో ఈ ఆరు స్టార్స్ పార్టీ పాటించే 6 ఆదర్శాలకు గుర్తు. ఈ ఆరు ఆదర్శాలు మన కొడుకలు, కుమార్తెలు తరతరాల వరకు ఆదర్శంగా వుండే విదంగా ఏర్పాటు చేయడం. దీనిలో తెలుపు రంగు స్టార్ స్వయం ప్రకాశకం వేలుగుతున్నట్టు సూచిస్తుంది. ఇది ఎప్పుడు మనం ఆదర్శంగా ఉండాలని సూచిస్తుంది.
మధ్యలో డాట్స్ :
మధ్యలో డాట్స్ మన అంతరాత్మకు గుర్తు. ఆత్మ మనకు వస్తానని తెలియజేస్తుంది అంతేకాదు మనల్ని మంచి వైపే నడవమని సూచిస్తుంది అదే మనకు సత్యం. మనం వేరువేరుగా వున్న ఆత్మ మాత్రం ఒక్కటే అలాగే మనం అందరం ఒక్కటే అని అనడానికి గుర్తు.
నల్లటి గీతాలు :
ఈ నల్లని గీతాలు చిహ్నంలో విప్లవంలో ఉండేటువంటి సమతుల్యాన్ని సూచిస్తుంది. అలాగే ఉత్సాహం సామరస్యం అపశృతి నివారించేందుకు గుర్తు.