పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్లో అడుగుపెట్టారు. ఆయన కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ లాక్ డౌన్ ముందు 80 శాతం వరకు షూటింగ్ ముగించుకుంది. ఇక మిగిలిన కొన్ని కోర్టు సన్నివేశాలను, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఈ కొత్త షెడ్యూల్లో పూర్తిచేయనున్నారు. షూటింగ్ రీస్టార్ట్ కావడంతో పవన్ గడ్డం తీసేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చేశారు. త్వరలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మొదలుపెట్టాల్సి ఉండటంతో పూర్తి సమయాన్ని ‘వకీల్ సాబ్’ కోసమే కేటాయించారు.
దీంతో ఆయనకు తీరికనేదే దొరకడంలేదు. అయితే సినిమాలతో పాటు తన పొలిటికల్ పార్టీ జనసేన పనులు కూడ ముఖ్యమే కాబట్టి షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు పార్టీ వ్యక్తులతో కూర్చొని ఆ పనులు చూసుకుంటున్నారు. ఈరోజు ఆయన జనసేన తెలంగాణ విద్యార్థి, యువజన విభాగాల కమిటీలను షూటింగ్ లొకేషన్ నుండే నియమించడం జరిగింది. అందుకు అవసరమైన పేపర్ వర్క్ మొత్తాన్ని లొకేషన్లోనే చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేయడం కోసం కష్టపడుతున్నదని కితాబిస్తున్నారు అభిమానులు.