పవన్ ఆ ఒక్క సినిమా చేసుంటే పొలిటికల్ ఎంట్రీ ఉండేది కాదట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలు అలాగే రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు చేస్తూనే ఇంకోపక్క పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనులు చకచకా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఇప్పుడు వరకు వచ్చిన సినిమాల్లో తన పర్యవేక్షణ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే తన దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా ఉంది.

అయితే తాను చేయాల్సిన సినిమాలు మరో హీరోలకి వెళ్ళినవి కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. అలా పవన్ చేయకుండా వదిలేసిన సినిమాల్లో ఒక్క సినిమా చేసుంటే తాను అసలు రాజకీయాల్లోకి వచ్చి ఉండేవారు కాదట. మరి ఆ చిత్రం ఏదో కూడా కాదు తన దర్శకత్వంలో చేయాలని అనుకున్న పొలిటికల్ యాక్షన్ చిత్రం “సత్యాగ్రహి”.

ఇపుడు హరిహర వీరమల్లు నిర్మాత తోనే అనౌన్స్ అయ్యి ఆగిపోయిన ఈ సినిమా తాను చేసి హిట్ అయ్యి ఉంటే రాజకీయాల్లోకి రాకుండా అమీర్ ఖాన్ లానే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయేవాడిని అని అన్నారని నిర్మాత ఏ ఎం రత్నం రివీల్ చేశారు. మరి అప్పట్లో అదే జరిగి ఉంటే పవన్ కెరీర్లో రాజకీయాలు అనే చాప్టర్ ఉండేది కాదని చెప్పవచ్చు.

Exit mobile version