పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఇప్పుడు ఆసక్తి గానే ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తోంది.
దీని ప్రకారం మేకర్స్ ఈ డిసెంబర్ నెలలో ఫైనల్ షెడ్యూల్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా అదే నెలలో కంప్లీట్ చేసేసి సినిమాని పూర్తి చేయనున్నట్టు ఇపుడు టాక్. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
