కళ్ళు తిరిగే ధరకు అమ్ముడయిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ నైజాం రైట్స్

కళ్ళు తిరిగే ధరకు అమ్ముడయిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ నైజాం రైట్స్

Published on Apr 23, 2013 9:57 PM IST

pawan-kalyan-trivikram

తాజా వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ నటిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ఇప్పుడు కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా యొక్క నైజాం హక్కులు అవాక్కయ్యే ధరకి గ్లోబల్ సినిమాస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విధంగా కొనమని గ్లోబల్ సినిమాస్ కి నితిన్ ఏ చెప్పాడట. ఈ విషయం గురించి నితిన్ ట్విట్టర్లో మాట్లాడుతూ ” నేను బయటకు చెప్పలేను కానీ నైజాం ఏరియా రైట్స్ ని మాత్రం అత్యధిక ధరకు కొనుగోలు చేసాం,,, నేనే ఈ సినిమాను కొనమని సలహా ఇచ్చాను”. ఇంతకీ విషయం ఏమిటంటే నితిన్, వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి ఈ గ్లోబల్ సినిమాస్ లో పార్టనర్స్.

పవన్ కళ్యాణ్, సమంత మరియు ప్రణీత సుభాష్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ముఖ్య పాత్రధారులు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇప్పటికే పొల్లాచి, హైదరాబాద్ లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలో బార్సిలోనాలో ముఖ్యమైన షెడ్యూల్ మొదలుపెట్టనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా మన ముందుకురానుంది .

తాజా వార్తలు