పొల్లాచ్చిలో మొదలైన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సందడి

pawan-kalyan-trivikram

ఇంతకుముందే వచ్చిన క్రేజీ కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తోంది అంటే ఆ సినిమా మొదలు కాక ముందు నుంచే ఆ మూవీపై అంచనాలు ఉంటాయి. అదే బాటలో ‘జల్సా’ తో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇటీవలే హైదరాబాద్లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి పొల్లాచ్చిలో మొదలైంది. ఇక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారు. సమంత మొదటిసారి పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. బి.వి.ఎస్.ఎన్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version