బ్రేకింగ్ న్యూస్.. గత కొద్ది సేపటి నుంచి ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడానికి సిద్దమయ్యారు. కానీ ఇంకా ఏది నిజం అనేది తెలియడంలేదు కానీ ఈ స్టార్ హీరో ఎంపిగా పోటీ చేస్తాడని సమాచారం.
పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వచ్చాయి. అలాగే కొద్ది నెలల క్రితం ఆయన కొత్త పార్టీ పెట్టకుండా తెలుగుదేశం పార్టలో చేరనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవేమీ జరగలేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన, అలాగే త్వరలో రానున్న ఎలక్షన్స్ కారణంగా ఈ వార్తలు వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. నిజంగానే పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ లాంచ్ చేయనున్నాడా? అభిమానులు పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ గురించి ఏమంటారు? ప్రస్తుతానికి సమాధానాలు లేని ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకి
రానున్న రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది..