ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా వేడుక జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముగుంపు వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ వేడుక లలితకళా తోరణంలో జరగనుంది. ఈ వేడుకకి గవర్నర్ నరసింహన్, మంత్రి డికె అరుణ కూడా హాజరు కానున్నారు.
గత కొద్ది రోజులుగా సక్సెస్ఫుల్ గా జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని వందల సినిమాలను ప్రదర్శించారు. ఈ వేడుకల ఓపెనింగ్ సెరెమనీకి బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్ హాజరయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగింపు సెరెమనీకి హాజరు కానున్నారు.