మన సౌత్ సినిమా దగ్గర అపారమైన ఆదరణ ఉన్న స్టార్ హీరోస్ లో స్టార్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే అటు తమిళ్ నుంచి బిగ్ స్టార్ అజిత్ కూడా ఒకరు. మరి ఈ బిగ్ స్టార్స్ మన దేశపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.
మరి ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ వారి అభిమానులు కళ్ళలో ఆనందం నింపుతుండగా ఇపుడు అజిత్ మరియు బాలయ్య లకి పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
అజిత్ మరియు బాలయ్యలు రెండు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవలు వారి వినూత్న టేస్ట్ ని తను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్స్ ని కొనియాడి వారు మరింత రాణించాలని కోరుకున్నారు. దీనితో బాలయ్య, అజిత్ అభిమానులు పవన్ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.