బన్నీ, చరణ్ ల ఉదారతకు పవన్ స్పెషల్ థాంక్స్.!

మన టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చింది అంటే వారి అభిమానులకు అంతకు మించిన పండుగ మరొకటి లేదు అన్నట్టుగా భావిస్తారు. కానీ ఆ వేడుకల్లో ప్రమాదవశాత్తు ఊహించని ఘటనలు జారుతుంటాయి కూడా. అలా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరుకు చెందిన పవన్ అభిమానులు ఫ్లెక్స్ కడుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు అభిమానులు విధ్యుత్ ఘాతం వలన చనిపోయారు.

దీనితో పవన్ మరియు పవన్ నిర్మాతలు సహా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని మాటిచ్చారు. అలా రామ్ చరణ్ చెప్పిన విధంగా రెండున్నర లక్షల చెక్ ను వారి కుటుంబాలకు అందజేశారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు లక్షల చొప్పున అందజేస్తానని తెలిపారు.

మొత్తం 6 లక్షలను అందించడంతో పవన్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లకు తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా తన నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మరియు రవి గార్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ వారి కోసం సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసారు.

Exit mobile version