మే నుండి పవన్ కళ్యాణ్ – సంపత్ నంది మూవీ

Pawan-and-Sampath-Nandi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘రచ్చ’ సినిమా డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మే మూడవ వారంలో ప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ ని అందరికి నచ్చే విదంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాన్ని తొందర్లో అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్నాడు.

Exit mobile version