‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పవన్ రెడీ.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను అంగీకరించిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌ను ముగించిన పవన్, ఇక ‘ఓజి’ని కూడా ముగించే పనిలో ఉన్నాడు. ఆయన వెంట వెంటనే డేట్స్ కేటాయించి తన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

అయితే, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పవన్ ఇదే జోరులో ముగించాలని చూస్తున్నాడట. ఈ చిత్రానికి కూడా పవన్ భారీగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సినిమాను పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం కాకుండా ముగించాలని చూస్తున్నాడట. ఈ చిత్ర షూటింగ్‌ను జూన్ 12 నుంచి నిర్విరామంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడుతో జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాతో పవన్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version