త్వరలో రానున్న ఎన్నికలలో తన సపోర్ట్ బి.జె.పి పార్టీకి వుండనుంది కళ్యాణ్ తెలిపాడు. ఈరోజు మోడీని కలిసిన పవన్ తెలంగాణా,సీమాంధ్రలలో వున్న సమస్యల గురించి చర్చించారు. పవన్ పార్టీ పెట్టగానే తను బి.జె.పి నాయకులను కలవనున్నాడని వచ్చిన పుకార్లు నిజమయ్యాయి
నేను మోడికి మద్దతు ఇస్తున్నానని, నేను రాజకీయనాయకుడిని కాదని, ఇక్కడకు పదవి గురించి రాలేదని పవన్ మీడియాతో తెలిపాడు. మొదటిసారిగా పవన్ ని కలిసాను. దేశానికి ఆయన ఏదో మంచి చేద్దామనుకుంటున్న భావన నాకు నచ్చిందని మోడీ ట్విట్టర్ లో తెలిపారు
ఈ నెల చివర్లో పవన్ వైజాగ్ లో భారీ జన సభ ఒకటి ఏర్పాటు చేయనున్నాడు. వీటివల్ల పవన్ కు సినిమాల గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది