సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఆది సాయికుమార్ కూడా ఒకడు. సాయి కుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ఆది లోనే మంచి హిట్స్ అందుకున్నాడు ఆది. కానీ మెల్లగా గ్రాఫ్ డౌన్ అయ్యింది. దీనితో మంచి కం బ్యాక్ ఇవ్వాలని చేసిన లేటెస్ట్ చిత్రం “శశి”. డెబ్యూ దర్శకుడు శ్రీనివాస నాయుడు తెరకెక్కించిన ఈ చిత్రం తాలుకా ట్రైలర్ ను ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పటికే టీజర్ అండ్ పాటలతో మంచి బజ్ ఏర్పర్చుకున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ గమనిస్తే ఇది వరకు టీజర్ లో చూపిన ఆది రోల్ ను మరింత ఇంటెన్స్ గా చూపించారు. తనలోని రెండు మేకోవర్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్ లో అదనంగా ఫ్రెండ్షిప్ మరియు లవ్ రెండు యాంగిల్స్ ను కూడా జోడించారు. మరి వీటిలో దేని వల్లనో డిస్టర్బ్ కాబడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా అగ్రెసివ్ రోల్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి.అందులో ఫైట్స్ అయితే కొత్తగా కనిపిస్తున్నాయి.
అలాగే సుర్భి కూడా మంచి రోల్ లో కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్షిప్ అండ్ లవ్, అలాగే తర్వాత ఆది నుంచి చూపిస్తున్న అగ్రెసివ్ కోణాలు ఒకింత రొటీన్ అన్న భావన కలిగిస్తుంది కానీ ట్రైలర్ లో ఒకలా చూపి సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి అభిప్రాయాలను మార్చిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. అలా ఇది కూడా ఉంటే డెఫినెట్ గా ఆదికు తన కెరీర్ లో మంచి పెర్ఫార్మర్ గా స్కోప్ ఇచ్చే సినిమా అవుతుంది. అలాగే ఈ ట్రైలర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. మరి ఈ చిత్రం ఎలా ఉండనుందో తెలియాలి అంటే వచ్చే మార్చ్ 19 వరకు ఆగాల్సిందే.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి