రాజకీయాలపై సొంత బుక్ రిలీజ్ చేయనున్న పవన్ కళ్యాణ్?

Pawan_Kalyan-10
సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ ప్రభంజనం.. ప్రస్తుతం ఇదే పేరు రాజకీయాల్లో కూడా వినిపిస్తుండడం వల్ల రాజకీయాలు మరింత వేడెక్కాయి. గత కొన్ని రోజుల నుంచి ఆయన కొత్త పార్టీ గురించి అనౌన్స్ చేస్తారని కొందరు చెయ్యరు అని కొందరు అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాకముందు పవన్ కళ్యాణ్ గురించి మాకు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది..

విషయంలోకి వెళితే.. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత రాజకీయ పథకాలు, ఆ పథకాలలో జరుగుతున్నా తప్పులు, అసలు రాజకీయ విధి విధానాలను ఎలా మారిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనే తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ ఓ బుక్ ని రాశారు. ఈ బుక్ ని వచ్చే వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఈ బుక్ లాంచ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని సమాచారం.

ఈ బుక్ రిలీజ్ తో పాటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం గురించి, తన కొత్త రాజకీయ పార్టీ గురించి తెలియజేస్తారా లేక ఆ విషయాల్ని మరొక ఈవెంట్ లో తెలియజేస్తారా అనేది ఇంకా ఖరారు కాలేదు.

Exit mobile version