‘హరిహర వీరమల్లు’తో కొత్త ట్రెండ్ సెట్ చేసిన పవన్

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సినిమా దగ్గర సెట్ చేసిన ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి. హూడిస్ వేసినా, ప్యాంటు మీద ప్యాంటు వేసినా, నుదుట ఎర్ర తుండు కట్టినా తన మార్క్ వేరు. ఇలా కమర్షియల్ సినిమాల్లో తానొక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో హిట్లు కొట్టడం పవన్ కళ్యాణ్‌కి మంచి నీళ్లు తాగినంత ఈజీ. కానీ సినిమాల ద్వారా చరిత్ర, సాంస్కృతిక విలువలు చెప్పాలనే బాధ్యత ఆయన దృక్పథంలో ఎప్పుడూ కనిపిస్తుంది.

అలాంటి మరో కొత్త ప్రయత్నమే హరిహర వీరమల్లు. సనాతన ధర్మం నేపథ్యంలో సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అలాంటి గట్స్ టన్నుల్లో ఉన్న పవన్ హరిహర వీరమల్లు లో చేసిన పాత్ర ఓ యోధుడు మాత్రమే కాదు…న్యాయానికి, ధర్మానికి నిలువెత్తు రూపం. చరిత్రలో జరిగిన అన్యాయాన్ని చూపించడాని ధైర్యంగా ముందుడుగు వేయడం రియల్ హీరోయిజమని వీరమల్లుతో నిరూపించారు పవన్.

సనాతన ధర్మం నేపధ్యంలో సాగిన ఈ కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. వీరమల్లు బాక్సాఫీసు కలెక్షన్స్ ని కొల్లకొడుతోంది. ఇదంతా.. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మ్యాజిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version