ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో చూసాము. ఇప్పటికి కొంత మేర ప్రభావం తగ్గినా కేసులు మాత్రం వస్తూనే ఉన్నాయి. అయితే మన తెలుగు ఇండస్ట్రీను కూడా ఎంతగానో కబళించిన కరోనా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడం తెలుగు ఇండస్ట్రీను ఒక్కసారిగా కుదిపేసింది.
దీనితో చిరు త్వరగా కోలుకోవాలని మొత్తం ఇండస్ట్రీ అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే మెగా బ్రదర్స్ నాగబాబు, చిరుకి కరోనా రావడంతో మరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత ఆందోళన పడుతున్నారు. ఎలాగో జాగ్రత్త తీసుకున్నప్పటికీ అందాకా బయటకు రావద్దని సినిమాలు లేట్ అయినా పర్వాలేదు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని వేడుకుంటున్నారు.
అలాగే రాజకీయాల విషయంలో కూడా కొన్నాళ్ళు బయటకు రావద్దని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పవన్ తన సినిమాలను చేసెయ్యాలనే బయటకు వచ్చేసారు. చాతుర్మాస దీక్ష లో చాలానే రోజులు తన ఇంటికే పరిమితం అయ్యారు పవన్. ఇప్పుడు బయటకు వచ్చేసారు. కానీ అభిమానులు ఏమో అలా అంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.