పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి పీవీపీ సినిమా నిర్మాణంలో ఒక కొత్త సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించనున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా పూర్తైన తరువాత ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. పీవీపీ సినిమా ఈ మద్య నిర్మించిన తెలుగు సినిమా ‘బలుపు’ మంచి విజయాన్ని సాదించింది. ఈ బ్యానర్ కి ఈ సినిమా మంచి కలెక్షన్లను సంపాదించి పెట్టింది. పీవీపీ సినిమా కొన్ని నెలల్లో కొంతమంది టాప్ హీరోలతో కలిసి సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తో నిర్మించనున్న ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ? మీ సమాధానాన్ని ఊహించి క్రింద కామెంట్స్ లో తెలియజేయండి.