మరో రికార్డును నెలకొల్పిన పవన్ కళ్యాణ్

Pawan_Kalyan_in_Atharintiki_Dharedhi (5)
‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల అయిన నాటినుండి ప్రేక్షకులు అందరూ ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి పైరసీ మరొకటి ఈ సినిమా సాధించిన రికార్డులు

ఈ సినిమా సీడెడ్ లో పది కోట్ల షేర్ సాధించింది. దీనిద్వారా నైజాం, సీడెడ్, ఓవర్ సీస్ లలో 10 కోట్లను సాధించగలిగిన ఏకైక హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించాడు. ఈ చిత్ర బృందం ఇటీవలే జతకలిపిన ఆరు నిముషాల సన్నివేశాలు ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు వచ్చేలా చేసి కలేక్షనలకు మరింత బలాన్ని చేకూర్చాయి

ఈ సినిమాలో సమంత మరియు ప్రణీత హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ సౌజన్యంతో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు

Exit mobile version