ఆ క్రేజీ మూవీ రీమేక్ పవన్ దగ్గరికి చేరిందా?

ఆ క్రేజీ మూవీ రీమేక్ పవన్ దగ్గరికి చేరిందా?

Published on May 13, 2020 9:13 AM IST

2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వచ్చిన ఈ చిత్రం, కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు ఎప్పుడో మొదలు కాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఆ నిర్మాత పవన్ కళ్యాణ్ ని డ్రైవింగ్ లైసెన్స్ మూవీ చూడమని కూడా కోరాడట.

మరి పవన్ కళ్యాణ్ ఒకే చేస్తే ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో పట్టాలెక్కే సూచనలు కలవు. డైరెక్టర్ లాల్ జూనియర్ తెరకెక్కించి ఈ మూవీలో పృథ్వి రాజ్ హీరోగా చేశారు. ఓ సూపర్ స్టార్ కి అతని అభిమాని అయిన ఆర్ టి ఓ ఆఫీసర్ కి మధ్య జరిగే ఆసక్తి పోరుగా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు