వకీల్ సాబ్ పై బ్యాడ్ న్యూస్..!

వకీల్ సాబ్ పై బ్యాడ్ న్యూస్..!

Published on Jul 25, 2020 3:00 AM IST


వకీల్ సాబ్ మూవీ కోసం పవన్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చుస్తున్నారు. పాలిటిక్స్ వలన ఆయన సినిమాలకు రెండేళ్లు విరామం ఇచ్చారు. దీనితో పవన్ ని వెండి తెరపై చూసి చాలా కాలం అవుతుంది. తాజా ఇంటర్వ్యూలో వకీల్ సాబ్ షూటింగ్ పై పవన్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరి అన్నారు. కావున ఇప్పట్లో షూటింగ్ మొదలుపెట్టడం సరికాదు అన్నారు. దీనితో వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పట్లో మొదలు కావడం కష్టమే అని స్పష్టం అయ్యింది.

కరోనా వైరస్ కి వాక్సిన్ రావడానికి సమయం పడుతుండని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెవుతున్న నేపథ్యంలో వైరస్ వెనుకాడడానికి ఇంకా సమయం పట్టనుంది. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వకీల్ సాబ్ కూడా వచ్చే ఏడాదే అని అర్థం అవుతుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ రోల్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు