డబుల్ సెంచురీ కొట్టిన పవన్ కళ్యాణ్

డబుల్ సెంచురీ కొట్టిన పవన్ కళ్యాణ్

Published on Nov 27, 2012 11:04 PM IST


చాలా కాలంగా సరైన హిట్ లేక ఫుల్ ఆకలి మీద ఉన్న పవర్ స్టార్ ఫాన్స్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చి వారి ఆకలిని పూర్తిగా తీర్చేసారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను నెలకొల్పి టాలీవుడ్ టాప్ గ్రాసర్ మూవీస్ లిస్టులో చేరిపోయింది. 2012 మే 11న విడుదలైన ఈ సినిమా నేటితో 200 రోజులు (డబుల్ సెంచురీ) పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఇంకా కొన్ని ఏరియాల్లో ప్రదర్శించబడుతోంది. హిందీలో వచ్చిన ‘దబాంగ్’ సినిమాకి రిమేక్ గా తీసిన ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చాలా మార్పులు చేసి తీసారు. ఎంతలా మార్చారు అంటే ‘గబ్బర్ సింగ్’ లోని కొన్ని సీన్స్ ని హిందీ వెర్షన్ ‘దబాంగ్ 2’ లో వాడుకునేంతగా మార్చారు.

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మూవీని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ని అందించారు.

తాజా వార్తలు