పవర్ స్టార్ మళ్ళీ పాడబోతున్నారట

పవర్ స్టార్ మళ్ళీ పాడబోతున్నారట

Published on Mar 24, 2021 1:39 AM IST

Pawan Kalyan 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నటనలోనే కాదు దర్శకత్వం, రచన, ఫైట్స్ కంపోజింగ్, పాటలు పాడటం ఇలా పలు అంశాల్లో పవన్ కు టచ్ ఉంది. ముఖ్యంగా పాటల్లో పవన్ ప్రత్యేక శైలిని ఫాలో అవుతుంటారు. ఎప్పుడు పాడినా జానపద గీతాలే పాడుతుంటారు. ఇప్పటికే ‘తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి’ లాంటి సినిమాల్లో పవన్ పాటలు పాడారు. ఆ పాటలన్నీ అభిమానుల్ని అలరించాయి.

అందుకే ఇంకోసారి ఆ ప్రయత్నం చేయనున్నారు ఆయన. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ ముగిసింది. ఇందులో పవన్ ఒక పాట పాడబోతున్నారట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా తెలిపారు. పవన్ పాడుతున్నారు అంటే అది తప్పకుండా జానపద గీతమే అయ్యుంటుంది. ఈ విషయం తెలియడంతో అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి మరింత ఎక్కువైంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు