“వకీల్ సాబ్” విషయంలో అన్నంత పనీ చేసారు.!

గత కొన్నాళ్ల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్” సాలిడ్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ నుంచి వస్తున్న కం బ్యాక్ చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఎంతకూ ఆ అప్డేట్ ఏంటి అన్నది రాలేదు. దీనితో కొంత కాలం నుంచి కాస్త నిరాశ గానే ఉన్నారు. ముఖ్యంగా ఈ దీపావళికి ఏదన్నా అప్డేట్ ఇస్తారేమో అని చూసారు. ఒకవేళ ఇవ్వకపోతే వారి నిర్మాణ సంస్థ నుంచి కనీసం దీవాళీ విషెష్ పోస్ట్ అయినా వేస్తారు అందులో వెయ్యి కామెంట్స్ తో హోరెత్తిస్తామని అన్నారు.

ఇప్పుడు అంతకు మించిన స్థాయిలోనే వెయ్యికి పైగా వకీల్ సాబ్ అప్డేట్ కోసం ఓ రేంజ్ లో అడుగుతున్నారు. కానీ అప్డేట్ అయితే ఇప్పుడప్పుడే రాదని తెలుస్తుంది. సో పవన్ అభిమానులు ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే అంజలి మరియు నివేతా థామస్ లు కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

Exit mobile version