రికార్డుల వేటలో పవర్ స్టార్ ఫ్యాన్స్.!

ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోల పుట్టినరోజు సంబరాలు అంతా ఆఫ్ లైన్ కంటే కూడా ఆన్లైన్ లోనే హోరెత్తుతున్నాయి. గత నాలుగైదు ఏళ్ళు నుంచీ ఈ ట్రెండ్ ఉన్నా ఇప్పుడు పరిస్థితులు మారడంతో మరింత స్థాయిలో జరుగుతున్నాయి. అలా సోషల్ మీడియాలో ఒక్కో హీరో అభిమానులు ఒకరి రికార్డులను ఒకరు బద్దలు కొట్టే పనిలో పడ్డారు.

అలా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ పుట్టినరోజుకు గాను కామన్ డీపీ విడుదల ట్రెండ్ లో భారీ స్థాయి ట్వీట్లు వేస్తూ వరల్డ్ రికార్డ్ పై కన్నేసామని చెప్తున్నారు.నిన్న సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్లో మొదలు పెట్టిన ఈ ట్రెండ్ ఫాస్టెస్ట్ 1 నుంచి 30 మిలియన్ వరకు భారీ ఎత్తున ట్వీట్లు వేసి రికార్డులు నెలకొల్పారు.

ఇంతకు ముందు ఉన్న కామన్ డీపీ రికార్డులను సగం టైం లోనే బద్దలు కొట్టేసి ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన బర్త్ డే ట్రెండ్ రికార్డ్ వైపు దూసుకెళ్తున్నారు. సగం టైం లోనే 30 మిలియన్ కి పైగా ట్వీట్లు వేశారు. మరి మిగతా మొత్తం టార్గెట్ ను అనుకున్న టైం లో కొట్టగలరో లేదో చూడాలి..

Exit mobile version