ఇంతకీ రీఎంట్రీ ద్వారా పవన్ ఎంత సంపాదిస్తున్నట్టు ?

ఇంతకీ రీఎంట్రీ ద్వారా పవన్ ఎంత సంపాదిస్తున్నట్టు ?

Published on Feb 4, 2020 8:02 PM IST

సినిమాలు చేస్తేనే నడుపుతన్న పార్టీని, నమ్ముకున్న వ్యక్తుల్ని నిలబెట్టగలనని చెబుతూ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ నిర్ణయాన్ని అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. ఇక వచ్చిందే తడవుగా పవన్ మూడు సినిమాలు కమిటయ్యారు. వాటిలో దిల్ రాజు నిర్మాణంలో పింక్ రీమేక్, ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ చిత్రం ప్రారంభమయ్యాయి. ఇక మైత్రీ మూవీస్, హరీష్ శంకర్ చిత్రం ఈ యేడాదిలోనే మొదలుకానుంది.

ముగ్గురూ బడా నిర్మాతలే కావడం వలన పవన్ చెప్పినంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల మాటల ప్రకారం ఒక్కో నిర్మాత నుండి దాదాపు రూ.30 కోట్లు తీసుకుంటున్నారట పవన్. అలాగే అమ్మకాల తర్వాత ఖర్చులు పోను లాభాలు మిగిలితే వాటిలో కూడా ఆయనకు వాటా ఉంటుందని తెలుస్తోంది. మొత్తం మీద పవన్ రీఎంట్రీ ఇచ్చి అనుకున్నట్టే గట్టిగా సంపాదిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే పవన్ చెప్పినంత పారితోషకానికి నిర్మాతలు పెద్దగా బెరసారాలు లేకుండానే ఓకే చెప్పేస్తుండటం. ఇక ఈ సినిమాలు గనుక వరుసగా హిట్టైతే రెమ్యునరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉందట.

తాజా వార్తలు