ఈరోజుల్లో పెద్ద పెద్ద తెలుగు సినిమాలలో ప్రధాన తారగా బ్రహ్మానందం తన పాత్రతో రాజ్యమేలుతున్నాడు. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ పవన్ కళ్యాన్, బ్రహ్మిల మధ్య ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ను పెట్టారు. సమాచారం ప్రకారం వీరిద్దరి నడుమ వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణట. ఇదివరకు చెప్పినట్టే పవన్ ఫుల్ జోష్ తో పాడిన ‘కాటమరాయుడా’ పాట సైతం బ్రాహ్మిని ఉద్దేశించి పాడినదే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రాలలో పంచ్ డైలాగులకూ, కామెడీ సీన్లకు కొదవ ఉండదు. ఈ చిత్రంలో కూడా వాటిని మిస్ అవ్వకుండా చూసుకున్నారు
సమంత హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు