ముందుగా మా 123తెలుగు వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎల్ల వేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ఆకాంక్షిసిస్తున్నాం. ఇక ఈ కొత్త ఏడాది వచ్చిందని అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సరికొత్త ఉత్సాహం వచ్చినట్టే..
మరి అలా ఈ 2021 ఆరంభమే మన టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చి ఫ్యాన్స్ కు దిల్ ఖుషి చేశాయి. అవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి న్యూయర్ స్పెషల్ పోస్టర్ తో సహా టీజర్ అనౌన్స్మెంట్. ఇక మరొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” నుంచి మరో సరికొత్త పోస్టర్.
ఇక వీటిలో శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ పోస్టర్ లో పవన్ మరియు శృతి హాసన్ లు బైక్ జర్నీ చేస్తూ సింపుల్ గా ట్రీట్ ఇవ్వగా రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో సింపుల్ అండ్ ప్లెసెంట్ గా డార్లింగ్ కనిపించి ఫ్యాన్స్ కు సంతోషం ఇచ్చాడు. దీనితో ఈ కొత్త సంవత్సర అప్డేట్స్ తో ఈ ఇరువురి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ గా ఉన్నారు.