ఫుల్ మీల్స్ పెడుతున్న పవన్, మహేష్ ల లేటెస్ట్ లుక్స్.!

ఫుల్ మీల్స్ పెడుతున్న పవన్, మహేష్ ల లేటెస్ట్ లుక్స్.!

Published on Nov 5, 2020 12:00 PM IST

ఏ హీరో అభిమాని తమ అభిమాన హీరో నుంచి కొత్త కొత్త స్టైల్స్ అలాగే లేటెస్ట్ లుక్స్ కోరుకోడు చెప్పండి. అందులోనూ భారీ స్థాయి ఫాలోయింగ్ ఉన్న హీరోల అభిమానులు అయితే మరీ ఎక్కువగా ఆశిస్తారు. ఇప్పుడు అలాంటి ఇద్దరు బడా హీరోల అభిమాలకు ఫుల్ మీల్స్ పడ్డట్టు అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన మేకోవర్ ను చేంజ్ చేసి దర్శనమివ్వగా తన సరికొత్త లుక్ పవన్ అభిమానుల్లో మరియు సినీ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మరో సెన్సేషనల్ హీరో సూపర్ స్టార్ మహేష్ కు చెందిన లేటెస్ట్ ఫోటో షూట్ తాలూకా స్నాప్స్ బయటకు వచ్చాయి.

వాటిలో కూడా మహేష్ లాంగ్ హైర్ తో సింపుల్ అండ్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. దీనితో ఇపుడు ఈ ఇద్దరి హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల లేటెస్ట్ లుక్స్ చూసి ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇద్దరి హీరోలకు అలాగే వారి అభిమానుల నడుమ ఏదో తెలియని అనుబంధం ఉంది. అది ఇలా మరోసారి కలిపింది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు