పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను చేసే చిత్రాల సంగీతాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తారు, అందుకే అయన చేసే అన్ని చిత్రాలలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం కోసం పవన్ కళ్యాణ్ స్పెయిన్లో లొకేషన్లను చూస్తున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పెయిన్ దేశం బెర్సిలోనలో త్రివిక్రమ్ మరియు పవన్ తో కలిసారు, అక్కడే ఈ చిత్రం కోసం ట్యూన్స్ చేస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ 2013 మొదట్లో ప్రారంభం అవుతుంది. పవన్ హైదరాబాద్ తిరిగి వచ్చేలోపు చాలా భాగం ట్యూన్స్ పూర్తి చెయ్యనున్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.