OTT : నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న జాన్వీ కపూర్ సినిమా .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sunny Sanskari Ki Tulsi Kum

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ (Sunny Sanskari Ki Tulsi Kumari). థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా రేపటి నుంచి, అంటే నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు థియేటర్ కంటే, ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడ్డానికి బాగుంటాయని చాలామంది భావిస్తుంటారు. థియేటర్లో సినిమాను మిస్ అయిన వారికి ఇది మంచి అవకాశం.

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో వరుణ్, జాన్వీలతో పాటు స‌న్యా మ‌ల్హోత్రా, రోహిత్ సరఫ్, మనీష్ పాల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. కలర్‌ఫుల్ విజువల్స్, మంచి పాటలు, కామెడీ సన్నివేశాలతో సాగే ఈ సినిమాను రేపటి నుంచి మీ మొబైల్ లేదా స్మార్ట్ టీవీలో చూసేయొచ్చు. ఈ వీకెండ్‌లో కొత్త సినిమా చూడాలనుకునే వారికి ‘సన్నీ సంస్కారి’ ఒక మంచి ఆప్షన్.

Exit mobile version