ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్న ‘అరేబియా కడలి’.. ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్న సత్యదేవ్

Arabia-Kadali

ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 31న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సత్యదేవ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్‌తో సిద్ధమవుతున్నాడు.

‘అరేబియా కడలి’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అవుతోంది.

Exit mobile version