ఓటిటి సమీక్ష: ‘మోతెవరి లవ్ స్టోరీ’ – తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘మోతెవరి లవ్ స్టోరీ’ – తెలుగు సిరీస్ జీ5 లో ప్రసారం

Published on Aug 8, 2025 1:04 AM IST

Love-Story-Feat

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఆగస్టు 8, 2025
స్ట్రీమింగ్‌ వేదిక :  జీ5
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అనీల్, గీలా, వర్షిణి, మురళీధర్, సదన్న, విజయలక్ష్మి తదితరులు
దర్శకత్వం : శివకృష్ణ బుర్ర
నిర్మాతలు : మై విలేజ్ షో, మధుర ఎంటర్టైన్మెంట్
సినిమాటోగ్రఫీ : శ్రీకాంత్ అరుపుల
సంగీతం : చరణ్ అర్జున్
ఎడిటర్ : అనీల్ గీలా

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జీ5 నుంచి వచ్చిన లేటెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ నే “మోతెవరి లవ్ స్టోరీ”. ఒక కామెడీ ఎమోషనల్ డ్రామాగా ప్లాన్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తెలంగాణలోని అయ్యారు పల్లి అనే గ్రామానికి చెందిన మోతెవరి బొంగుల పరశురాములు (మళ్ళా రెడ్డి) తన ఆస్తిని ఒకరి పేరిట రాసేసి ఆత్మహత్య చేసుకుంటాడు. అతనికి ఉన్న ఇద్దరు కొడుకులు సత్తయ్య (మురళీధర్), నర్సింగ్ యాదవ్ (సదన్న) అన్నదమ్ముల బాగానే కలిసి ఉంటారు. పైగా వాళ్ళ నాన్న పనిచేసిన కొన్ని భూములు వాళ్ళ నుంచి వెనక్కి లాక్కుంటారు. ఇంకోపక్క పర్శి (అనీల్ గీలా) అనిత (వర్షిణి) ప్రేమ ట్రాక్ నడుస్తుంది. సత్తయ్య కూతురు అయ్యిన అనితని ప్రేమించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పర్శి ప్లాన్ లు వేస్తుంటాడు. ఈ క్రమంలో తన బామ్మ అనుమవ్వ (విజయలక్ష్మి) విషయంలో ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటారు. అక్కడ నుంచి కథ ఎలా మారింది. వీరి పెళ్లి అయ్యిందా లేదా? అందుకు వచ్చిన చిక్కులు ఏంటి? అసలు అనుమవ్వ ఎవరు? ఆమె గతం ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో బాగా ఇంప్రెస్ చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది పెట్టిన టైటిల్ కి దర్శకుడు న్యాయం చేసారని చెప్పాలి. మోతెవరి లవ్ స్టోరీని తాను ప్లాన్ చేసుకుని ఆవిష్కరించిన తీరు అందులోని స్వచ్ఛమైన తెలంగాణ నేపథ్యంలో చూపించడం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ముఖ్యంగా 3, 4 ఎపిసోడ్స్ ఈ సిరీస్ లో చాలా బాగున్నాయి.

ఒక అందమైన ప్రేమ కథని మంచి ఎమోషనల్ మూమెంట్స్ తో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక వీటితో పాటుగా అక్కడక్కడా మంచి ఫన్ మూమెంట్స్ బాగున్నాయి. ఇంకా పర్శి, అనితల నడుమ లవ్ ట్రాక్ కూడా కొంత మేర మెప్పిస్తుంది. అలాగే వారికి ఇచ్చిన గుడ్ ఎండింగ్ కూడా బాగుంది. ఇక నటీనటుల్లో యంగ్ జంట బాగా చేశారు. పక్కా పల్లెటూరు అమ్మాయి, అబ్బాయిలా మంచి ఎక్స్ ప్రెషన్స్, వారి పాత్రల్లో ఇన్నోసెన్స్ ని బాగా పండించారు.

అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాస్టింగ్ కూడా బాగుంది. బాల అనుమవ్వగా మైరా పులి, బాల పరశురామ్ గా రాజు బైరగోని పర్ఫెక్ట్ గా కనిపించారు అంతే బాగా నటించారు. ఇక అన్నాతమ్ముళ్ళో మురళీధర్ ఎప్పటిలానే చాలా బాగా చేశారు. తన తెలంగాణ మాండలికం బలగం, డీజే టిల్లు లాంటి సినిమాల్లో చూసాం అలానే ఇందులో కూడా మంచి పెర్ఫామెన్స్ చేశారు.

ఇక తన తమ్ముడు నర్సింగ్ యాదవ్ గా చేసిన సదన్న పాత్ర మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తాను చెప్పే కొన్ని సామెతలు భలే ఉంటాయి. తన పాత్రని డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. అంతకు మించి సదన్న ఈ పాత్రలో బాగా చేశారు. ఇక వీరితో పాటుగా వీరి భార్యలుగా చేసిన నటులు, అనుమవ్వగా చేసిన విజయలక్ష్మి కూడా మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు ఒకదాని తర్వాత ఒకొకటి కొంచెం బెటర్ గా అనిపిస్తాయి. అంటే మొదటి రెండు ఎపిసోడ్స్ కొంచెం డల్ గా సోసో గానే స్టార్ట్ అయినప్పటికీ మధ్యలో వచ్చిన ఎమోషన్స్ అండ్ కామెడీ ముందు వాటి లోపాలని మర్చిపోయేలా చేసాయి. .

కానీ నాలుగో ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ అంశాలు నెమ్మదించాయి. ఒకింత రొటీన్ కథనం మళ్ళీ కనిపిస్తుంది. ఒక చిక్కుముడి వచ్చాక దాన్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ దానిని సాగదీయడం ఎటెటో తిప్పుతూ లాగడం అనవసరం అనిపిస్తుంది. ఒక రొటీన్ ఎండింగ్ నే ప్లాన్ చేసుకున్నప్పుడు మధ్యలో ఇంత డ్రామా అవసరం లేదు అనిపిస్తుంది.

ఇక వీటితో పాటుగా ఈ సిరీస్ లో మోతెవరి లవ్ స్టోరీ బాగుంది కానీ పర్శి లవ్ ట్రాక్ కూడా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. సో ఇలాంటి వాటిలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో చేయడం మూలాన మరింత నాచురాలిటీ కనిపించింది. కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో సంగీతం మంచి ఎసెట్, నేపథ్య సంగీతం కానీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బెటర్ గా ట్రై చేయాల్సింది. 7 ఎపిసోడ్స్ కాకుండా ఆరింటి లోనే ముగించాల్సింది.

ఇక దర్శకుడు శివ కృష్ణ బుర్ర విషయానికి వస్తే.. ఒక డీసెంట్ లైన్ ని తీసుకున్నారు అందులో మోతెవరి ప్రేమకథను మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు. కదిలించే ఎమోషన్స్, నీట్ ఫ్లాష్ బ్యాక్, నటీనటులు నుంచి మంచి నటన మ్యూజిక్ లో తన టేస్ట్ బాగున్నాయి. కాకపోతే మిగతా అంశాల్లో మాత్రం రొటీన్ కథనాన్నే తాను నడిపించారు. ఓవరాల్ గా తన వర్క్ పర్వాలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మోతెవరి లవ్ స్టోరీ” సిరీస్ కొంతమేర ఓకే అనిపిస్తుంది అని చెప్పాలి. మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు బ్యూటిఫుల్ గా సాగిన ఈ సిరీస్ ఆ తర్వాత ఈ మూమెంటంని కొనసాగించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా రొటీన్ గానే ఉన్నా పర్లేదు మంచి సంగీతం, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అక్కడక్కడా కామెడీ కోరుకునేవారికి ఈ సిరీస్ పర్లేదు అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు