సాలిడ్ టీఆర్పీ రాబట్టిన బాలయ్య ‘డాకు మహారాజ్’

Bala-Krishna

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్లో భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం రీసెంట్ గానే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి తీసుకొచ్చారు.

మరి బిగ్ స్క్రీన్స్ పై గర్జించిన డాకు మహారాజ్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో డాకు మహారాజ్ కి 8.23 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా మన స్టార్ హీరోస్ లో కానీ పలు భారీ సినిమాలతో పోల్చినా కూడా ఇది సాలిడ్ రేటింగ్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version