నెట్‌ఫ్లిక్స్ నుంచి బాహుబలి మూవీ తొలగింపు.. కారణం అదేనా..?

నెట్‌ఫ్లిక్స్ నుంచి బాహుబలి మూవీ తొలగింపు.. కారణం అదేనా..?

Published on Oct 4, 2025 9:03 PM IST

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘బాహుబలి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఆ తర్వాత బాహుబలి 2 కూడా అంతేస్థాయిలో విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలకు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ రెండు సినిమాలను తొలగించారు. దీంతో బాహుబలి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే, త్వరలోనే ‘బాహుబలి ది ఎపిక్’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడిషన్ చిత్రం రిలీజ్ కానుంది. అభిమానులకు కొత్తగా, ఎప్పుడూ చూడని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. “బాహుబలి: ది ఎపిక్” విడుదల తరువాత ఈ రెండు భాగాలు మళ్లీ స్ట్రీమింగ్‌లోకి వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

తాజా వార్తలు