ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అవైటెడ్ ఫ్యామిలీ మ్యాన్ 3.!

the-family-man-3

మన ఇండియన్ ఓటీటీ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యిన ఒరిజినల్ కంటెంట్ లో నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్రలో దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒకటి. అయితే ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చి వరల్డ్ వైడ్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక నెక్స్ట్ సీజన్ 3 కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా డేట్ ని ఆమెజాన్ ప్రైమ్ వీడియో వారు రివీల్ చేసేసారు.

ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ తో ది ఫ్యామిలీ మ్యాన్ ఈ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కి వస్తున్నట్లు అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం ఇది బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ఇక ఈ స్పై యాక్షన్ సిరీస్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో అప్పుడు వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version