గ్లోబల్ స్టార్ స్టంట్ తో కొత్త క్యాటగిరీ పరిచయం చేసిన ఆస్కార్స్

ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు ఏదన్నా ఉంది అంటే అది ఆస్కార్ ని అందరికీ తెలిసిందే. మరి ఈ అత్యున్నత పురస్కారం ఓ సినిమాలో ఏ చిన్న క్యాటగిరిలో వచ్చినా కూడా ఆ మొత్తం చిత్రానికే గర్వ కారణంగా భావిస్తారు. అలా మన ఇండియన్ సినిమా దగ్గర మొట్ట మొదటి ఆస్కార్ ని అందుకున్న చిత్రమే “రౌద్రం రణం రుధిరం”.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో గ్లోబల్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్ సెట్ చేసిన సంచలనం సంగతి అందరికీ తెలిసిందే. ఇలా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఈ సినిమా విషయంలో ఏ చిన్న న్యూస్ అయినా ఫ్యాన్స్ ని చిత్ర యూనిట్ ని ఎగ్జైట్ చేస్తుంది. మరి లేటెస్ట్ గా ఆస్కార్ వారు తమ నుంచి ఒక కొత్త క్యాటగిరీని పరిచయం చేశారు.

ఒక కొత్త వార్షిక అవార్డుగా ఇక నుంచి స్టంట్ డిజైన్ క్యాటగిరీని అనౌన్స్ చేశారు. అయితే ఈ అనౌన్సమెంట్ లో హాలీవుడ్ చిత్రాలు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ (Everything Everywhere All at Once) అలాగే టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ (Mission Impossible) స్టంట్స్ పోస్టర్స్ తో పాటు RRR నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టంట్ ని కూడా యాడ్ చేసి అనౌన్స్ చేశారు. దీనితో ఇది చూసిన చరణ్ ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు.

అయితే RRR కి ఈ ఛాన్స్ లేదు కానీ రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ సినిమాల్లో RRR తరహా నాచురల్ స్టంట్స్ పడితే మాత్రం ఆస్కార్స్ లో నామినేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వారు ఈ అవార్డుని 2027లో రిలీజ్ అయ్యే సినిమాల నుంచి స్టార్ట్ చేయనున్నారట. అలా 2028లో 2027లో విడుదల అయ్యిన సినిమాలకి గాను ఇవ్వనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ నుంచి వచ్చే సినిమాలు స్టంట్స్ సాలిడ్ గా ఉంటే తప్ప ఇందులోకి ఎంపిక కావు.

Exit mobile version