‘ఆస్కార్‌ 2025’ విజేతల జాబితా ఇదే !

‘ఆస్కార్‌ 2025’ విజేతల జాబితా ఇదే !

Published on Mar 3, 2025 11:11 AM IST

‘ఆస్కార్‌ 2025′ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు విజయకేతనం ఎగురవేశారు. అట్టహాసంగా జరిగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. మరి 97వ ఆస్కార్‌ అవార్డు విజేతల పూర్తి జాబితాను చూద్దాం రండి.

ఆస్కార్‌ విజేతలు వీళ్లే..

ఉత్తమ చిత్రం – అనోరా

ఉత్తమ నటుడు – అడ్రియన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్‌ (అనోరా)

ఉత్తమ దర్శకత్వం – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సహాయ నటుడు – కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

ఉత్తమ సహాయ నటి – జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే – కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)

ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ – ది సబ్‌స్టాన్స్‌

ఉత్తమ ఎడిటింగ్ – అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్‌ (లాల్‌ క్రాలే)

ఉత్తమ సౌండ్‌ – డ్యూన్‌: పార్ట్‌2

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – డ్యూన్‌:పార్ట్‌2

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ (వాల్టర్‌ సాల్లెస్‌- బ్రెజిల్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ – ది బ్రూటలిస్ట్‌ (డానియల్‌ బ్లమ్‌బెర్గ్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – వికెడ్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ – ఐయామ్‌ నాట్‌ ఏ రోబో

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌– ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ – నో అదర్‌ ల్యాండ్‌

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ – ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌

సంబంధిత సమాచారం

తాజా వార్తలు