అక్టోబర్ 2 న అహ లో “ఒరేయ్ బుజ్జిగా”?


కరోనా లాక్ డౌన్ కారణం గా ధియేటర్స్ మూత బడి పోవడం తో చాలా సినిమాల చిత్రీకరణ పూర్తి అయినా, విడుదలకు నోచుకోవడం లేదు. అయితే దాదాపు ఆరు నెలల పాటుగా దియేటర్లు మూత పడటం నిర్మాతలకు మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ లో దాదాపు అందరికీ కష్ట కాలం నడుస్తుంది. అయితే ఈ సమయం లోనే ఆన్లైన్ ద్వారా సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇలా డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా పలు సినిమాలు విజయం సాధించాయి. ఇపుడు అదే దారిలో ఒరేయ్ బుజ్జి గా విడుదల అయ్యేందుకు సిద్దం అయింది.

రాజ్ తరుణ్ హీరోగా, హెబ్బ పటేల్, మాళవిక నెయిర్ లు హీరోయిన్ లు గా నటించిన ఈ చిత్రం అహ యాప్ ద్వారా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు (సెప్టెంబర్ 11 న) వెలువడనుంది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 2 న అహ లో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version