థమన్, దేవిశ్రీ లలో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో..?

థమన్, దేవిశ్రీ లలో ఈసారి ఎవరిది పైచేయి అవుతుందో..?

Published on Mar 15, 2020 5:28 PM IST

ఓ నెల వ్యవధిలో మెగా హీరోల నుండి రెండు సినిమాలు విడుదల కానున్నాయి. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మే నెలలో విడుదల కానుండగా, మెగా డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ రెండు చిత్రాలకు థమన్ మరియు దేవిశ్రీ పనిచేస్తున్నారు. దీనితో ఈ రెండు చిత్రాల పాటల విషయంలో ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి చిత్రాలలో అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దేవిపై థమన్ పై చేయి సాధించారు.

కాగా మరో మారు వీరు వకీల్ సాబ్, ఉప్పెన చిత్రాలతో పోటీపడుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ నుండి మగువా మగువా అనే సాంగ్ విడుదల కాగా ఉప్పెన నుండి నీకన్ను నీలి సముద్రం… మరియు దగ్ దగ్ అనే మరో పాట విడుదలైంది. మగువా సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 8 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా, ఉప్పెన చిత్రంలోని నీకన్ను నీలి సముద్రం 15 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం విశేషం. ఈ రెండు చిత్రాల పూర్తి ఆల్బమ్ వస్తేకానీ ఎవరు ఎవరిపై పై చేయి సాధించారో తెలుస్తుంది.

తాజా వార్తలు