మెగాస్టార్ విషయంలో ఇంకా సస్పెన్సే..?

మెగాస్టార్ విషయంలో ఇంకా సస్పెన్సే..?

Published on Nov 6, 2020 9:07 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ “ఆచార్య”అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం కూడా అన్ని సినిమాల్లానే లాక్ డౌన్ వలన ఆగిపోయి తిరిగి పునః ప్రారంభం చెయ్యడానికి రెడీగా ఉంది.

అయితే మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నామని అలాగే ఈ నవంబర్ 9 నుంచి షూట్ ను ఆరంభిస్తున్నమని తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ మొదటి రోజు నుంచే షూట్ లో పాల్గొంటారా లేదా అన్నది మళ్ళీ సస్పెన్స్ గా మారినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ టైం లో కూడా మొదట అయితే మెగా స్టార్ షూట్ లో పాల్గొనకుండానే మొదలు పెడతారని తెలిసింది. మరి ఈసారి అధికారికంగా వచ్చిన సమాచారంలో మెగాస్టార్ ఎప్పుడు నుంచి షూట్ లో పాల్గొంటారో చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు