ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బాహుబలి సినిమాలో ఆమె చేసిన శివగామి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఇక టాలెంటెడ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో ఆమె సి ఎమ్ జయలలితగా కనిపించారు. కాగా మరో మారు రమ్యకృష్ణ సీఎం రోల్ లో కనిపించనున్నారట.
మెగా హీరో సాయితేజ్ తో దర్శకుడు దేవా కట్టా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో తేజ్ డాక్టర్‌గా..సీనియర్ నటి రమ్యకృష్ణ శక్తివంతమైన ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని సమాచారం. తేజుకి జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జె.భగవాన్..పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఏలూరులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.