నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమా ఆడియో మే 25న విడుదల కానుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఘనంగా జరగనుంది. ‘ఓం’ ఇండియాలోనే మొట్టమొదటి సారిగా 3డిలో షూట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్. సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బందా, నిఖీషా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. గత 7 నెలలుగా ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా 3డి, విఎఫ్ఎక్స్ కార్యక్రమాలను సింగపూర్, అమెరికాలలోని ది బెస్ట్ స్టూడియోస్ లో జరుగుతున్నాయి.
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కుమార్తె నందమూరి తారక అద్వైత నిర్మాత. అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ గా ‘ఓం’ తెరకెక్కుతోంది.